మానవత్వమా...నీవెక్కడ
ఎండ చాలా తీవ్రంగా ఉంది
కేంద్ర ప్రభుత్వం పై కే .సి .అర్ .కోపం లా ఉందా ఎండ ,తన మాట వినని మంత్రుల పై సి .ఎం కోపం లా ఉంది ,2G
కుంభకోణం లో తన నొక్కడినే ఇరికించారని ,జైలు జీవితం గడుపుతున్న ఎ .రాజా కోపం లా ఉందా ఎండ.
వరంగల్ గబగబా అబివ్రుద్ది చెందుతున్న పట్టణం క్షణం తీరికలేని జనసంచారాలతో ఉద్యమాలకు ,ఉపద్రవాలకు
కేంద్రబిందువై రాజకీయ కురుక్షెత్రం గా మారింది .
కాని ఆరోజు.............
వరంగల్ బిక్క చచ్చి పోయింది నగరమంతా నిశబ్దం రాజ్యమేలుతోంది.అక్కడక్కడా కుక్కల అరుపులు తప్ప
మరేమీ వినిపించడం లేదు.
తెలంగాణా ప్రజల మనో భావాలు దెబ్బ తీసారంటూ సమైక్యవాదులపై ఉద్యమకారులు
జరిపిన దాడిలో బస్సులు ద్వంసమైనాయి దహనమైనాయి వందలాదిమందికి గాయాలు ఒకరిద్దరు మరణించారని
తెలుగు వార్తాఛానల్స్ హడవుడి.
ప్రభుత్వం మాత్రం పరిస్తితి అదుపులోఉందని ప్రజలంతా సంయమనం పాటించాలని పోలీసులకు సహకరించాలని కోరింది నగరమంతా కర్ఫూ 144 సెక్షను
విధించారు పోలీసుల బూట్ల చప్పుడు ,తుపాకుల కవాతులు మాత్రమే వినిపిస్తున్నాయి.
ఎమ్మార్వో ఆఫీసు వెనుక వీధిలో ఓపాడు పడిన దేవాలయం లో అరుగు మీద కూర్చుని తెగ ఆయాస పడి ఆపసోపాలు పడుతున్నాడు అంజిగాడు పక్కనే కూతురు రత్తి రెండు రోజులుగా
తిండి లేదు ఈ ఉద్యమాలవలన పని కూడా దొరకడం లేదు కనీసం అడుక్కుందామన్నా అవడం లేదు ఎందుకొచ్చానురా భగవంతుడా అంటూ తల బాదు కుంటున్నాడు
శ్రికాకుళం నుంచి పని వెతుక్కుంటూ గత ఏడాది వచ్చాడు వచ్చిన కొన్నాళ్ళకే అల్లర్లలో భార్య ని పోగొట్తుకున్నాడు.
స్తలం మారినా రాత మార లేదు పూట గడవటం చాలా కష్టం గా ఉంది. దానికి తోడు కూతురు ఎదుగుతోంది.
లాభం లేదు ఎలాగైనా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి తనలో తనే అనుకోసాగాడు.
ఆకలివేస్తొంది నీరసంగా వుంది.
నీరసించి నీరసించి నిట్టూర్పులు విడుస్తున్నాడు.
తండ్రి బాధను చూసి తట్టుకోలేకపోయింది రత్తి అయ్యా నువ్వు ఈడనే కూకో నే పక్క సందులోకెల్లి ఎవరినన్నా
అడిగి ఏటన్నా తీసుకొత్తాను అంటూ లేచి నిలుచుంది.
అంత నీరసం లోనూ గబాలున లేచి కూర్చున్నాడు అమ్మో రత్తీ నువ్వెల్లకె అక్కడ పోలీసులుంతారు.ఆళ్ళు మంచోల్లు కారే అన్నాడు.
పొలీసోల్లు నన్నేటి సెత్తారు నన్ను సూడగానే ముస్టిదాన్నని ఒదిలెస్తారు
ఏటీ సెయ్యరు గాని ఉండు వత్తా
అంటు పక్కన ఉన్న సత్తుగిన్నె పట్టుకుని గబాలున అరుగు పైనుండి కిందికి దుమికి పక్క సందు లోకి పరిగెట్టింది.
అలా ఆ పిల్ల వెళ్ళిన వైపే ఆందోళనగా చూస్తూ ఉండిపొయాడు
వీధంతా నిర్మానుష్యం గా ఉంది.
ఏపోలీసు కంట పడకుండా తనపని తాను చేసుకు పోవాలని ఆశగా ఆత్రుతతో ముందుకెళ్తోంది
అంతలో ఓ కర్కశమైన గొంతు వినిపించింది ఏవరే నువ్వు ?ఇటు రాకూడదు
వెళ్ళిపో పో పో అంటూ గదమాయించాడు.
ఆంధ్రా పోలీసుకి కొంచెం డ్యూటీ మైండెడ్ నెస్. ఎక్కువ అవసరం ఉన్నా లేక పొయినా అధికారాన్ని ,అహం కారాన్ని చూపిస్తుంటాడు
అంతలో ఓ యువ పొలీసు వచ్చి "నువ్వెల్లు అన్నా" నే జూసి పంపుతాలే అంటూ వచ్చాడు వస్తూనే ఇట్టా రావే అన్నాడు
భయం భయంగా దగ్గరకెళ్ళి నిలుచుని నోట్లో నీళ్ళు నములుతూ అయ్యకి బాగులేదు ఆకలేసి అక్కడ పడిపోయడు నాలుగిల్లు అడిగి అన్నం తీసుకెలదామని
వచ్చా సారూ అంది
దాన్నే తదేకం గా చూస్తూ ముందుకు వచ్చాడు బుజాన వున్న తుపాకీ తీసి పక్కన పెట్టి బాగ్ లోనుంచి ఓ రొట్టెని తీసి దానికి చూపిస్తూ కావాలా అన్నాడు.
ఆశగా కళ్ళింత చేసుకుని ఆ రొట్టె వైపు చుడసాగింది. కాని భయం భయం గానె ఉంది.
ఇట్లా రావే గదమాయించాడు వణికిపోతూ దగ్గరకెళ్ళి నిలుచుంది.పరవాలేదే చూట్టానికి ముష్టి పిల్ల అయినా "పక్వానికి "వచ్చినట్టుంది.
చాలీచాలని చిరుగు దస్తులలోనించి కాలి పిక్కలను పిరుదులను వచ్చీరాని ఎత్తులనూ చూస్తూరొ్ట్టె ఇస్తా వస్తావా?అంటూ నే అమాంతం
రెండు చేతుల్తో ఎత్తుకుని పక్కన ఉన్న చెట్టు చాటుకు తీసుకెళ్ళాడు.
రత్తి "పులికి చిక్కిన మేక లా ఎం జరుగుతుందో అర్ధం కాలేదు కాని ఏదో ఎదో జరుగుతోంది ఊపిరి ఆడటం లేదు నొప్పిగా ఉంది భరించలేకపోతోంది అమ్మా!! అరవాలనుకుంది
కానీ ఆకలి నోరు నొక్కేసింది.
అరిస్తే రొట్టె ఇవ్వడేమోనని భయం. మౌనంగా భరిస్తోంది పంటి బిగువున నరకాన్ని.
దిక్కులు స్తంబించిపోయయి పంచభూతాలు నోరు మూసుకున్నాయి. పట్టపగలు జరుగుతున్న ఈ దారుణనికి సభ్యసమజం సిగ్గుతో కళ్ళు మూసుకుంది.
ఓ తుఫాను వెలిసింది ఆయాసంతో పైకి లేచి ఫాంటు సరిచేసుకుంటూ రొట్టెను దానిపైకి విసిరి వెనక్కి చూడకుండా విజయగర్వం తో వెళ్ళిపొయడు్.
అంతే అతనటు వెల్లగానే రెండు కాళ్ళ మధ్య నున్న రొట్టె ని అందుకుందామని ఆశగా ఆబగా లేచింది చెయ్యి చాపింది కళ్ళు తిరిగినట్లు అనిపించింది
అంతా రక్తం. రక్తం లో రొట్టె అందుకోకుండానే అలా వెనక్కి పడిపొయింది.
ఆ మానవ మృగం మరలిందని కాబోలు కాస్త ధైర్యం తెచ్చుకుని మెల్లగా కదలడం మొదలెట్టింది కాలం.
ఆకలితో ఆందోళనతో అంజిగాడు అక్కడ
అచేతనం గా రత్తి ఇక్కడ
ఈ రాక్షష క్రీడ చూడలేక కాబోలు మబ్బు చాటున ముఖాన్ని దాచుకున్నాడు సూరీడు
సెహబాస్ మానవత్వమాసెహబాస్
*************************************************
మర్నాడు
ఏం జరింగిందో రత్తి ఎలా ఉందో ఆత్రుత చంపుకోలేక గబగబా వచ్చాడు భాలభానుడు
అప్పటికే ఆ వీధిని ఊడ్చడానికి వచ్చిన పాకీ మనిషి ఎం చూసిందో ఎమో పరుగు పరుగున చెట్టు దగ్గరకు వెళ్ళింది
పేద హ్రుదయం గుండె బాదుకుంది. అర్ధమైందోఅర్ధం చేసుకుందో గానీ బండిలో నున్న చెత్త ని కిందకు పడెసి ఆ పిల్లను రెండు చేతుల్తో ఎత్తి ఆమునిసిపాలిటీ
బండిలో పడుకో బెట్టి ప్రభుత్వాసుపత్రి వైపు గబ గబా తోసుకెళ్ళసాగింది.
ఇంతకీ మానవత్వానికేమైంది ?
బ్రతికి ఉందా? బ్రతికింపబడుతుందా?
అసహ్యించుకున్నాడేమో ఆదిత్యుడు ఆవేదనతో ఆవేశంతో మీ అంతు చూస్తానంటు ముందుకెల్తున్నాడు .
*************************************************