Monday, 24 December 2012

యువతరం ' శివమెత్తితే " ఢిల్లీ సాక్షిగా --నవతరం రాదా? యువతా మీకు జోహార్లు --!

ముందుగా-
మహాకవి శ్రీ శ్రీ అన్నట్లుగా " కొంతమంది యువకులు ముందుయుగం దూతలు ,భావన నవజీవన బృందావన
నిర్మాతలు --వారికి మా ఆహ్వానం --వారికి మా లాల్ సలాం .అటువంటి యువతకి చై ఎత్తి జోహార్లు చెప్తూ---
అదే స్పూర్తి --
అదే శక్తి --
అదే పట్టుదల --
అంబరం అదిరింది
అంభోనిది బెదిరింది ,
" అబల " పై -అకృత్యానికి --నిరసనగా
ఆవేశం గళమెత్తి --ఒక్కటైంది -
ఆదర్శం -ఆశయాన్ని --ఎక్కుపెట్టింది ,
ఆ సేతు హిమాచలం --
" మానవత్వం " ఉప్పెనై పొంగింది
జన సునామీ కి --" ఢిల్లీ " --వణికింది ,
యంత్రాంగపు --మంత్రాంగాలు
తంత్రాల --కుతంత్రాలు --అవాక్కయ్యాయి -,
దిక్కు లేనివారం -మేము కాదంటూ-ధైర్యంగా
హక్కుల కోసం --నినదిస్తే --గర్జిస్తే --
భారతావని --భగ్గు మంది -
ఇదే స్పూర్తి --
ఇదే శక్తి -
ఇదే పట్టుదల కొనసాగిస్తే -
రొ్స్టు రాజకీయాలు --మార్చలేమా ?
కుస్టు కుంభకోణాలు --ఆపలేమా ?
అవినీతి --అన్యాయాల నెదిరించలేమా ?
అప్రజాస్వమ్యాన్ని --అంతమొందించలేమా ?
అఖండ భారతాన్ని --నిర్మించి
అజేయ శక్తి గా మార్చలేమా ?
భరతమాత ను గర్వం గా నిలబెట్టలేమా?
రండి --కదిలి రండి --కలిసి రండి --
మీరంతా --ఊ్రంతా --ఉప్పెనలా --
అదిగో --అల్లదిగో --అదిగదిగో --
యువతరం చేతుల్లో --
నవతరం --నవ్య భారతం --

Wednesday, 19 December 2012

నేస్తమా --నన్ను క్షమిస్తావా--? ఈ చేదు జ్నాపకాన్ని మరిచిపోతావా--?

నీవెవరో నాకు తెలియదు
నేనెవరొ నీకు తెలియదు ,
నిజం నేస్తం -జంధ్యాల పంతుల్లు
మనుధర్మం పేరుతో -మనకు మనువు చెస్తె ;
ఆశయాల్ని --ఆదర్శాన్ని చంపుకునికుని --నేను
అభిరుచుల్ని -ఆ--రుచుల్ని -అందుకోవాలని --నీవు
ఆరంభించిన ఈ జీవితం అర్ధం ఏమిటి ?
బిత్తర చూపుల్తో --తత్తర పడుతూ
పాలగ్లాసు తో మురిపెంగా వచ్చిన -ఓ సతి
ఎమని చెప్పను ? ఎలా చెప్పను ?
' గులాభీ' కి కూడా కాపలాగ ముళ్ళుంటాయి -కదా
సిగరెట్లు గుండెని తినేస్తే -
పాన్మసాలాలు ీర్నాశాయాన్ని హరిస్తే .
మిగిలిన ఈ తోలు బొమ్మ తో --
నూరేళ్ళు సాగాలనా --ప్రియసతి
దురదృస్టం నీదా --నాదా ?
నీకన్న ముందే --' నీ జాగా '--
ఆక్రమించుకున్న --మృత్యువుని "
ఎలా సాగనంపేది --
నీ కెలా స్వాగతం పలికేది ?
క్షమించు నేస్తం --
ఇది అంచలు -- లేని అఖాతం --
( ఇది ఒక మిత్రుడి వైవాహిక జీవితం గురించి వ్రాసినది )