Saturday, 25 February 2012

క్లాసు ---మాసు --?

క్లాసు --మాసు
మనకు వినిపించే " ఆధునిక "  పదాలు ,
గొప్ప ---పేద
అనాదిగా ఉన్న అగాధాలు
మానవుల మధ్య పెట్టని గోడలు
మనకు కనిపించని అగ్నిగుండాలు
క్లాసు --కారులో తిరుగుతాడు
మాసు ఊహల్లో తిరుగుతాడు ,
క్లాసు కట్టిపడేసింది --
మాసుకి చుట్టిపడేస్తుంది --
క్లాసు విలాసాలకు --మాసు మటాసు
మాసు కి కోపం వస్తే -క్లాసు స్మాష్ --
అయితేనెం --
ఎక్కడా కలవని --క్లాసు ;మాసు
బానిసలు కాదే --గ్లాసుకు --
సమాసమములు కారే శ్మశానాలకు --?

Friday, 17 February 2012

ఇక్కడ --శవాలు --అమ్మబడును ? (భలే మంచి చవక బేరము )--?

రాముడు --మానవుడే --కానీ -దైవత్వానికి  ప్రతీక --
రావణుడు --మానవుడే --కానీ --దానవత్వానికి  ప్రతీక --
సుధారసం ఆనందానికి ---మరి --హలాహలం ' విషాదానికా --?
ఎంత వ్యత్యాసం ఉందో కదా --
యుగయుగాలుగా తరతరాలుగా ఈ విభిన్నమైన మనస్తత్వాలను చూస్తునేవున్నాము ,నేడు మానవుడు ఓ
ఊహ కందని విధం గా ప్రయానం సాగిస్తున్నాడు .ఒకవైపు రాతి యుగం నుంచి రోదసీ యుగం లోకి పయనిస్తూ
అఖండ విజయం సాదిస్తూ --దైవత్వానికి సవాలు విసురుతున్నాడు --మరో వైపు --రక్షసులు సైతం సిగ్గు తో
తలదించుకుని --అవురా --! అనిపించుకునేంత -నీచం గా తయారైనాడు .
గౌతముడు --అశోకుడు --జీసస్ --గాంధీ --మానవ జాతి మనిహారాలైతే --అధు నిక మానవుడు --ఏ తత్వానికి
చెందినవాడవుతాడు ?? ఇంత నీచం గా ఎందుకు తయారవుతున్నాడు ?వీడి ధన దాహానికి --స్వార్దానికి అంతు లేదా /
ఇసు క మాఫియా --మధ్యం మాఫియా --భూ మాఫియా --అన్ని మాఫియాలకన్నా --ఇప్పుడు కొత్త మాఫియా
ప్రారంబించాడు --అదే ---" శవాల మాఫియా "--నిన్ననే దినపత్రికలో " రాజధానిలో శవాల మాఫియా వార్త చదివాను
చాలాసేపటివరకు కోలుకోలేకపోయాను ,మలినమైన మానవ సంస్క్రుతిలో మనుషులైనందుకు సిగ్గు పడాలి --
తలదించుకోవాలి --
--ఉస్మానియా యూనివర్సిటిలో  శవాలను కూడా అమ్మేసుకుంటున్నారట  .కొందరు డాక్టర్లు "మాఫియా "గా మారిఅనాధ శవాలను విచ్చలవిడిగా మార్చురీనుండి అమ్మేస్తూ సొమ్ము చేసుకుంతున్నారట -
వైద్య కలాశాలలో ప్రాక్టికల్స్ కోసం శవాలు అవుసరమవుతాయి .రాష్ట్రమ్లో ప్రైవేటు కలాశాల లతో పాటు డిల్లీ --
చెన్నై --కేరల నుంచి కూడా శవాల కోసం ఉస్మానియాకు వస్తుంటారు .ఈ డిమాండు ను "వరం 'గా మార్చుకుని
కొందరు వైద్యులు ఒక్కో శవానికి రెండు లక్షలు నుంచి మూడు లక్షల వరకూ విక్రయిస్తున్నారట -ఈ శవాల
విక్రయం ద్వారా గత ఏడాది ఉస్మానియా ఆసుపత్రికి అరవై లక్షలు ఆదాయం కూడా వచ్చిందట .అంటే శవాలకు
ఎంత డిమాండు ఉందో అర్ధం చేసుకోవచ్చును .
ఎక్కడైనా రోడ్డు ప్రమాదం లో మరణించినవారి శవాలను మార్చురీలో 72 గంటలు ఉంచుతారు .చనిపోయిన
వ్యక్టికి సంబంధించి న  బంధువులు రాకపోతే పోస్ట్మార్టం చేసి జి .హెచ్ .ఎం .సి .కి ఖననం కోసం అప్పగిస్తారు ,
ఆ తరువాత పేపర్లో ప్రకటన ఇస్తారు ,శవం ఫొటోను పోలీసులకు ప్రచురనకై ఇవ్వాలి ,ఫొటో చూసిన తరువాత
కూడా బంధువులు ఎవరూ రాలేదంటే మృతదేహాన్ని జి .హెచ్ .ఎం .సి .కి  అంతిమ సం స్కారానికి ఇవ్వాలి .
కానీ ఇవేమీ అమలు కావడం లేదు .పోస్టు మార్టం చేయకుండానే పోలీసులకు తప్పుడు నివేదికలిచ్చి --తరువాత
శవానికి ఎంబాల్మింగ్ ప్రక్రియ పూర్తి చేసి శవాలను అమ్మేస్తున్నారట .గతం లో ఓ మునిసిపల్ ఉద్యోగి శవం
మాయమైతే ఆ ఘటన అసెబ్లీని కుదిపేసింది .అయినా చర్యలు అంతాంత మాత్రమే --పత్రికలు --చానల్లు
ఎంత మొర పెట్టుకున్నా పట్టించ్కునేవాడే లేడంతే ---ఎంత ్ దౌర్భాగ్యం --/
డబ్బు కోసం శవాలతో కూడా వ్యాపారం చేస్తున్నారంతే --వ్యవస్త --ఎంత దారుణం గా ఉందో కదా ?
పరుచూరివారు అన్నట్లుగా " శ్మశానం ముందు ముగ్గు ఉండదు --వ్యాపారికి సిగ్గు ఉండదు " మానవ జాతికి గతి
ఉండదు .
అక్షరాలు తడబడే వేళ --ఓ --మానవుడా --నీ కొత్త అవతారానికి జోహార్లు --నీ ధన దాహానికి సతసహస్ర కోటి
వందనాలు --వర్ధిల్లు --వింత పశువా --వర్ధిల్లు --











Tuesday, 14 February 2012

నే చూసిన " విశ్వరూపం " ?

శూన్యం లో మహా విస్పోటనం  జరిగిందో ? --లేదో --?
బిగ్ బాంగ్  థియరి నిజమో కాదో --
పాలపుంతలో గ్రహవిన్యాసాలు  అవునో ?  కాదో  ?
---నాకు  అనవుసరం --
నాకు తెలిసిన  అద్భుత ప్రపంచం --నాన్న --
ఎవరెస్టు కన్నా ఎత్తైన వ్యక్తిత్వం --
పసిఫిక్ కన్నా లోతైన మమకారం --
నాలుగు దిక్కుల నడుమ
పంచభూతాల సంగమ క్షెత్రం లో -
"ఆలికి "---మాతృత్వపు  మాధుర్యాన్ని పంచి
అమ్మ గా నిలిపిన ఓ --వి్శ్వరూపమా --
ఓం కార బీజాక్షర ,ఆది ప్రణవనాదాలతో
ప్రపంచానికి నన్ను పరిచయం చేసిన
ఓ సజీవ దైవమా --నీవేనా  "---నాన్నంటే -"
నీ మాటే వేదం గా --నీ బాటే నాదం గా
నా అణువణువు  నీవై --అంబరమంతా నీవై -
ఆప్యాయతలకు నిలయమై --
ఆశయ ఆదర్సాలకు కొలువై --
నా అంతా నీవై --నీ --వింతే --నేనై --
మానవ జాతికి  మార్గదర్సివై  --మనీషివై --మహాత్ముడవు నీవై --
మమతానురాగాల పందిల్లలో మానవత్వం పూయించిన --ఓ --నాన్నా--
నిన్ను --నా హృదయపు కోవెలలో    ప్రతిస్టించి --
నా నయన మైదానాలమీద --" చిరంజీవిగా --'
నిత్యం --నీ వి్శ్వరూపాన్ని --పూజిస్తా --నాన్నా --.



Friday, 10 February 2012

టు హెల్ విత్ టుమారో --? (విష సంస్కృతి లో ఇండియా యువత --?)


సల్మాను ఖాను --షారూక్ ఖాను ---అమీర్ ఖాను --
స్తైలిష్ స్టార్ --రెబల్ స్టార్ --పవర్ స్టార్ --
మాకు రోల్ మోడల్స్ --మా inspirations ,-
           సిక్స్ పాక్ ---ఏయిట్ పాక్ --టెం పాక్ --
           స్లీవ్ లెస్స్ --నెక్ లెస్స్ ---జిప్ లెస్స్ --
           మా అభిరుచులు --మా aspirations --
కామ్నా --కాజల్ --ఇలియానా --
సమంతా --దీపికా --కత్రినా --
 మా కలల ఐడల్స్ --మా edorations --
          పబ్ లు ---క్లబ్ లు --రమ్ము లు --దమ్ము లు
          హాషీష్ --చరష్ --గంజాయి --డైజీపాం --
          మాకు కాలక్షేపాలు --మా respirations --
కాలేజీలు --కాటేజీలు --కేంపస్లు --
ఐనాక్షులు --మాక్స్ లు --కెఫేలు --
మాకు దేవాలయాలు --మా motivatives --
          చేజింగు --ఫోజింగు --రాగింగు -
          చీటింగు --చాటింగు --డేటింగు
          మా ఆశయాలు --మా destinations--
సబ్యత మాకు --useless 
సంస్కారం  మాకు non-sense
సాంప్రదాయం మాకు baseless-
నో కేరీర్ --నో ఫ్యుచెర్ --
ఇదే జీవనం --ఇంతే జీవితం --
లైఫ్ ఈస్ ఎ మూవీ --
ఎంజోయ్ --గురూ --
       (కొంత మంది యువత ని చూసి ,రాసినది ,చాలా్ భాదగా ఉంది -)  

Sunday, 5 February 2012

పక్షం ---విపక్షం --?

పదిహేను రోజులకొక పక్షం -
పదిహేను మంది  కలిస్తే -"ఓ పక్షం "
పదిహేను మంది ఎదురు తిరిగితే --" విపక్షం "--
         గొప్పవారంతా ఓ పక్షం
         పేదవారికి  విపక్షం --
పగలుకు రాత్రి --రాత్రికి పగలు
అగ్నికి నీరు --నీటికి నిప్పు
ఒకరికొకరు --విపక్షం --
"వృక్షం "--అందరి  పక్షం --
కానీ --
మనిషి --?
పక్షానికి ---విపక్షానికి --" విపక్షం ".

Friday, 3 February 2012

కనిపించుట లేదు ---దయచేసి --వెతకండి --!?

్కనిపించడం  లేదని --తెలిసి -
దిగ్బ్రాంతి   చెందా--
ఎంత మంచిదండి --?
అందరినీ తన వాళ్ళనుకునేది --
అనుభందాల పెంచి --ఆత్మీయత పంచి
ఆనందాల వరమిచ్చింది --
ఎంత -ఘోరం జరిగింది --?
                                       ఎక్కడుందో --ఎలాగుందో --?
                                       ఉందో ---లేదో --?
                                       ఉంటే --కనిపించేది --కదా
                                       మరి  ఎమైంది --!?
                                       ఎలా మాయమైంది --?
                                       ఎవరా --ముష్కరులు --?
                                       దాచేశార ---లేక --దోచేశార --?
                                       ఎంత --ఘొరం --జరిగింది --?
"అక్కడక్క్డడ "సమస్యలొచ్చినా ---
"అప్పుడప్పుడు "---కన్నీరొచ్చినా--
ఎప్పుడూ --ప్రశాంతం గా ఉండేది --
అవి శ్రాంతం గా --పోరాడేది --
కొన్నెళ్ళక్రితం --అందరికీ -
కొన్నాల్ల క్రితం --కొందరికీ--
్కనిపించి --కనుమరుగైందట -
ఏం --చేస్తాం --
                                       బహిరంగ సభలు --పెట్టండి -
                                       చానళ్ళకు చెప్పండి --పేపర్లలో వేయించండి
                                       "తెచ్చినవారికి "--ఎక్కడుందో -
                                       "చెప్పినవారికి --"వరాలివ్వండి "--
                                       దిక్కు నడగండి --చుక్కనడగండి -
                                       పక్కనెల్లె ---పశువు నడగండి
                                       కానీ   ---కానీ  --
"మనిషిని "మాత్రం --అడగకండి -
మనసు లేనివాడు --మమత మరచినవాడు -
దాణవాగ్రణుల  --మించినవాడు --
మానవోత్తముల --వంచించినవాడు -
"రక్తం 'తో --రంగుల పండుగ లాడేవాడు --
నా మాటే నిజం కాకపోతే --
కసికసిగా కాల్చి పారేసిన --కసబ్ ని
పసిప్రాయం లో --నలిపేసిన కామాంధులని -
ఉన్మాదం తో --ఉగ్ర "వేదం ' --రాస్తూ
దానవత్వాన్ని --ప్రభోదించే --"మతాల "నడగండి --
"మానవత్వం " ---ఎలా ---మాయమైందో--?