Friday, 17 February 2012

ఇక్కడ --శవాలు --అమ్మబడును ? (భలే మంచి చవక బేరము )--?

రాముడు --మానవుడే --కానీ -దైవత్వానికి  ప్రతీక --
రావణుడు --మానవుడే --కానీ --దానవత్వానికి  ప్రతీక --
సుధారసం ఆనందానికి ---మరి --హలాహలం ' విషాదానికా --?
ఎంత వ్యత్యాసం ఉందో కదా --
యుగయుగాలుగా తరతరాలుగా ఈ విభిన్నమైన మనస్తత్వాలను చూస్తునేవున్నాము ,నేడు మానవుడు ఓ
ఊహ కందని విధం గా ప్రయానం సాగిస్తున్నాడు .ఒకవైపు రాతి యుగం నుంచి రోదసీ యుగం లోకి పయనిస్తూ
అఖండ విజయం సాదిస్తూ --దైవత్వానికి సవాలు విసురుతున్నాడు --మరో వైపు --రక్షసులు సైతం సిగ్గు తో
తలదించుకుని --అవురా --! అనిపించుకునేంత -నీచం గా తయారైనాడు .
గౌతముడు --అశోకుడు --జీసస్ --గాంధీ --మానవ జాతి మనిహారాలైతే --అధు నిక మానవుడు --ఏ తత్వానికి
చెందినవాడవుతాడు ?? ఇంత నీచం గా ఎందుకు తయారవుతున్నాడు ?వీడి ధన దాహానికి --స్వార్దానికి అంతు లేదా /
ఇసు క మాఫియా --మధ్యం మాఫియా --భూ మాఫియా --అన్ని మాఫియాలకన్నా --ఇప్పుడు కొత్త మాఫియా
ప్రారంబించాడు --అదే ---" శవాల మాఫియా "--నిన్ననే దినపత్రికలో " రాజధానిలో శవాల మాఫియా వార్త చదివాను
చాలాసేపటివరకు కోలుకోలేకపోయాను ,మలినమైన మానవ సంస్క్రుతిలో మనుషులైనందుకు సిగ్గు పడాలి --
తలదించుకోవాలి --
--ఉస్మానియా యూనివర్సిటిలో  శవాలను కూడా అమ్మేసుకుంటున్నారట  .కొందరు డాక్టర్లు "మాఫియా "గా మారిఅనాధ శవాలను విచ్చలవిడిగా మార్చురీనుండి అమ్మేస్తూ సొమ్ము చేసుకుంతున్నారట -
వైద్య కలాశాలలో ప్రాక్టికల్స్ కోసం శవాలు అవుసరమవుతాయి .రాష్ట్రమ్లో ప్రైవేటు కలాశాల లతో పాటు డిల్లీ --
చెన్నై --కేరల నుంచి కూడా శవాల కోసం ఉస్మానియాకు వస్తుంటారు .ఈ డిమాండు ను "వరం 'గా మార్చుకుని
కొందరు వైద్యులు ఒక్కో శవానికి రెండు లక్షలు నుంచి మూడు లక్షల వరకూ విక్రయిస్తున్నారట -ఈ శవాల
విక్రయం ద్వారా గత ఏడాది ఉస్మానియా ఆసుపత్రికి అరవై లక్షలు ఆదాయం కూడా వచ్చిందట .అంటే శవాలకు
ఎంత డిమాండు ఉందో అర్ధం చేసుకోవచ్చును .
ఎక్కడైనా రోడ్డు ప్రమాదం లో మరణించినవారి శవాలను మార్చురీలో 72 గంటలు ఉంచుతారు .చనిపోయిన
వ్యక్టికి సంబంధించి న  బంధువులు రాకపోతే పోస్ట్మార్టం చేసి జి .హెచ్ .ఎం .సి .కి ఖననం కోసం అప్పగిస్తారు ,
ఆ తరువాత పేపర్లో ప్రకటన ఇస్తారు ,శవం ఫొటోను పోలీసులకు ప్రచురనకై ఇవ్వాలి ,ఫొటో చూసిన తరువాత
కూడా బంధువులు ఎవరూ రాలేదంటే మృతదేహాన్ని జి .హెచ్ .ఎం .సి .కి  అంతిమ సం స్కారానికి ఇవ్వాలి .
కానీ ఇవేమీ అమలు కావడం లేదు .పోస్టు మార్టం చేయకుండానే పోలీసులకు తప్పుడు నివేదికలిచ్చి --తరువాత
శవానికి ఎంబాల్మింగ్ ప్రక్రియ పూర్తి చేసి శవాలను అమ్మేస్తున్నారట .గతం లో ఓ మునిసిపల్ ఉద్యోగి శవం
మాయమైతే ఆ ఘటన అసెబ్లీని కుదిపేసింది .అయినా చర్యలు అంతాంత మాత్రమే --పత్రికలు --చానల్లు
ఎంత మొర పెట్టుకున్నా పట్టించ్కునేవాడే లేడంతే ---ఎంత ్ దౌర్భాగ్యం --/
డబ్బు కోసం శవాలతో కూడా వ్యాపారం చేస్తున్నారంతే --వ్యవస్త --ఎంత దారుణం గా ఉందో కదా ?
పరుచూరివారు అన్నట్లుగా " శ్మశానం ముందు ముగ్గు ఉండదు --వ్యాపారికి సిగ్గు ఉండదు " మానవ జాతికి గతి
ఉండదు .
అక్షరాలు తడబడే వేళ --ఓ --మానవుడా --నీ కొత్త అవతారానికి జోహార్లు --నీ ధన దాహానికి సతసహస్ర కోటి
వందనాలు --వర్ధిల్లు --వింత పశువా --వర్ధిల్లు --











1 comment:

  1. దిగజారుడుతనానికి పరాకాష్ట ఇది. ఛీ..ఛీ...

    ReplyDelete