Wednesday, 24 July 2013

ఆంధ్రా అసెంబ్లీ --డిల్లీ లో పెడితే బాగుంటుందేమో --? ఒక్కసారి ఆలోచించండి --;

నిజంగా -- ఇది నిజం --
ఆంధ్రులు --అమాయకులా ?అల్ప సంతోషులా ?
అనాధలా ? లేక ఆలోచించని వారా ?
అడుగడుగునా అధికార దుర్వినియోగం --జరుగుతున్నా
పట్టించ్జుకోని ఘనత మనదేనా ?
అవినీతి --అంతై --అంతంతై --అకాశమంతా ఆక్రమించినా
కనీసం  ఆవెశం కూడా రానివాడు ==
ఆంధ్రుడే ననుకుంటా --
కాకపోతే మరేమిటండీ --
ప్రతి చిన్న విషయానికి --" డిల్లీ " చుట్టు ప్రదక్షినలు చేస్తూ
ఆత్మగౌరవాని  అక్కడ వీధుల పాలు చస్తుంటే
నోరు మూసుకుని కూర్చోవడం మంచిదా ?
పరిపాలన మొత్తం డిల్లీ కనుసన్నలలో జరుగు తుంటే
ఇక ఇక్క్డ అసెంబ్లీ ఎందుకు ?
కరంటు .పోలీసు ,అది ,ఇది అన్నీ దందగే కదా
ఎంత ప్రజా ధనం దుర్వినియోగం అవుతుందో ఆలోచించండి
పదవి కోసం --డిల్లీ-ప్రాపకం కోసం --డిల్లీ
మంత్రి పదవి కావాలా --డిల్లీ --ఉన్న పదవి తీయాలా --డిల్లీ
పధకం పెట్టాలా --డిల్లీ --
చివరకు వ్యక్తి గత విషయాలకు కూడా - సారీ --
అనక తప్పడం లేదు -
డిల్లీ --అనుమతి కావాలి --
చెతకాని వాళ్ళమా లేక చేవ లేని వాల్లమా
అందుకే --అందుకే --
ఇక్కడ --అసెంబ్లీ అక్కడ పెడితే బాగుండును కదూ--


3 comments:

  1. తమ ఇంట్లో శుభకార్యం జరపడానికి కూడా డిల్లీ వెళ్ళి తేది తెచ్చుకునేవారికి ఆత్మవంచనే తప్ప ఆత్మాభిమానం ఏముంటుంది!?౩౩ మంది లోకసభ్యులను పంపినా ఏమి కేంద్ర ప్రాజెక్టులు తెచ్చుకోగలిగాం కనుక,ఎన్ని రైళ్ళు తెచ్చుకోగలిగాం మనం!!మనం తెలుగువాళ్ళం మన వంటింట్లో వెలుగువాళ్ళం!డిల్లీ నేతల ఇంటి ముంగిళ్ళలో ఆపసోపాలు పడేవాళ్ళం!

    ReplyDelete
  2. వారి ఢిల్లీ ప్రయాణాలను 2014నుంచి నిలిపివేసే సువర్ణావకాశం మనముందుందిగా! దాన్ని సద్వినియోగం చేసుకుంటే సరి!

    ReplyDelete
  3. 2004 ముందు ఢిల్లీలోని ఎ పి భవన్ లోపలికి చాలా సులభంగా వెళ్ళేవాళ్ళం. ఎ పి భవన్లో ఫంక్షన్లకి హాజరవ్వాలన్నా, సినిమా చూడాలన్నా, కేంటిన్లో భోజనం చెయ్యాలన్నా ఏ చెకింగులూ, నిరోధాలు ఉండేవి కావు. వీలైనప్పుడల్లా, శనివారం లోపల ఉన్న వేంకటేశ్వరస్వామికి దణ్ణం పెట్టుకునేవాళ్ళం.
    ఎ పి లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకా, అనుమతి లేనిదే ఎవరినీ లోపలికి పంపటంలేదు. కేంటిన్‌కి కూడ వేరే ఎంట్రన్స్ పెట్టారు.

    ReplyDelete