" ఆడతనం "--ఓడింది --"అమ్మతనం " ---గెలిచింది --!?
ఈ మధ్య నా మనసేమీ బాగుండటం లేదు ,అల్లకల్లోలం గా ఉంది -ఏ పనినీ సవ్యం గా చేయలేక పోతున్నాను .ఏదో అలజడి ,ఏదో అసంతృప్తి -ఎడతెగని ఆలోచనల ప్రవాహం లో కాస్సేపు అటు
కాస్సేపు ఇటు కొట్ట్కుపోతున్నాను .
అన్యమనస్కంగా ఉంటున్నానని చీవాట్లు కూడా తింటున్నాను .ఎం చెయ్యను ? సాదారణంగా నేను ఏదీ పట్టించుకోను -నా భర్త;నాఇల్లు,నా బాబు ,అంతే -బంధువులందరూ ఊరిలో వున్న వెల్లేది చాలా తక్కువ అవుసరం వస్తే ఫోను లో ్మాటలాడటమే .టి .వి .చూడను ,ఒకవేల చూసినా తెలుగు సీరియల్స్ అస్సలు చూడను ,స్త్రీని ఎంత రాక్షసం గా చూపిస్తారో ? స్త్రీ మానసం లో లేని గుణ గణాలను చిత్రం గా చిత్రీకరించి ఆడదంటే అసహ్యం వేసేలా చూపిస్తూ --సొమ్ము చేసుకుంటున్నారు .అయినా అదంతా అప్రస్తుతం -ఆడదంటే వీళ్ళ కేమి తెలుసు? ఆడదాని నిజ విశ్వరూపాన్ని వీళ్ళు ఎన్నటికీ చూడలేరు -చూడబోరు !ఎవరో అన్నట్లుగా " దేముడు అన్ని వేలల తోడు ఉండటం సాధ్యం కాదని స్త్రీ ని సృష్టిం చాడంటారు -నాకు మాత్రం అది నిజమే అనిపిస్తుంది -ఆడదే లేకుంటే ? ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుందేమో ? అవసరార్ధమో లేక పరిస్తితుల ప్రభావమో లొంగిపోతుంది -లేదా లొంగదీయ బడుతుంది .అంతా జరిగినాక సర్ధుకుపోతుంది -ఇదే జీవితం అనుకుంటుంది --అణిగి మణిగి ఉంటుంది .అలా అలవాటు చేసుకుంటుంది ,నాటి సీత నుండి నేటి షాలినీ వరకు అంతే --?
ఆలోచిస్టుండగానే కాలింగు బెల్లు మోగింది --ఎవరూ అంటునే తలుపు తీసి చూసింది -ఎదురుగా అప్పన్న గాస్ సిలెండెర్ పట్టు కుని వచ్చాడు -డె లివరీ తీసుకుని డబ్బు లిచ్చి పంపేసింది ,ఎం చెయ్యాలి ? ఆయన ఆఫీసుకి వెల్లారు -బాబు స్కూలుకి వెళ్ళాడు --ఇంటి పని వంట పని అయిపోయింది --ఎం చెయ్యాలో తోచక అలా సోఫా లో కూర్చుని ఆలోచిస్తోంది.
కళ్ళు తెరిచినా --కళ్ళు మూసినా ఆ దృశ్యమే కనిపిస్తోంది ఆ చిన్నారి రూపమే -- ఎంత బాగున్నాడు ? అమూల్ బేబీ లా ,బోసి నవ్వుతో --ఎంత అందం గా ఉన్నాడో? బొద్దు గా ముద్దుగా ఉన్నాడు -- ఏ తల్లి కన్న బిడ్డడో ? " పొత్తిళ్ళ లో పెరగాల్సినవాడు విస్తర్ల మధ్య పెరుగుతున్నాడు !ఆ సుమ సుకుమార శరీరం ఎండకు కంది ,వానకు తడిసి, చలికి వణికి పోతూ --దుమ్మూ ధూలిలో పెరుగుతున్నాడు -ఆ చిన్నారి తండ్రి ని చూసి మనసు బా్ధ తో మూలుగుతోంది,కళ్లు చెమర్చాయి --ఎమీ చెయ్యలేని నిస్సహాయత ?
రెండు నెలల క్రితం అనుకుంటా ఆ బాబుని చూసింది --అదిగో అప్పటి నుంచి అలజడి మొదలయ్యింది .పోనీ పెంచు కుందామా అంటే ఆయన ఏమంటారో ? భయం --దానికి తోడు తనకు ఓ బాబు ఉన్నాడు --వాడూ చిన్న పి్ల్లాడే -
ప్రతీ గురువారం ముగ్గురం కలిసి షిర్ది బాబా మందిరానికి వెలతాము .ఎన్ని పనులున్నా ఆయన బాబా మందిరానికెల్లడం మానరు .ఆ రోజు దర్శనం అయిన తరువాత సరదాగ మర్రిపాలెం వెళ్ళాము అదిగో అప్పుడు చూసాను ఈ బాబుని --
రోడ్దు పక్కన ఇద్దరు కుస్టు రోగులు కూర్చుని దారిన పోయే వారిని అడుక్కుంటున్నారు ,
ఒకడు చెక్కల బండిలో కూర్చున్నాడు--వేరొకడు దానిని తోసుకుంటూ తీసుకెల్తున్నాడు
చెక్కల బండిలో కూర్చున్న ముస్టి వాడి ఒడి లో ఈ బాబు కూర్చుని వున్నాడు- యధాలాపం గా చూశా ,కానీ కళ్ళు తిప్పుకోలేక పోయా -వాళ్ళు చూస్తే అడుక్కునేవాళ్ళు -అబాబు మాత్రం వాళ్ల బిడ్డ కాదు --అని తెలిసిపోతుంది.ఆ అందమైన మొహం చూసి వెంటనే ఎత్తుకుని గుండె లకు హత్తుకోవాలనిపించింది.ఆయనకు చెప్పాను --ఏవండీ --ఒక్కసారి ఆ బాబుని చూడండీ ఎంత బాగున్నాడో కదా? అన్నాను అతనూ చూసాడు --ఒక్క క్షనం మవునం గా
వుండిపోయాడు --కాస్త తేరుకుని --అన్నారు " ఏవరో కని పారెసిన పిల్లాడనుకుంటా --వీళ్ళు తెచ్చి " సింపతీ కోసం అడుక్కుంటున్నారు " అంటూ బైక్ లాగించేసారు -
ఆ తరువాత రెండు మూడు సార్లు బాబా మందిరం దగ్గరే చూసాము.అదేమిటో ముందుగా బాబు కోసమే నా కళ్ళు వెతికేవి .వాళ్ళు అడుక్కుంటుంటే బోసి నవ్వు తో ఆ బండిలో ఆడుకునేవాడు,.ఏ తల్లి --కన్న బిడ్డ్డో " ఎలా పెరెగాల్సినవాడు ?ఎలా పెరుగు తున్నాడని --
ఎంతో బాధ పడేదాన్ని .
********** *********** ************
మరలీనగర్ --
హైదరబాదు లో బంజారా హిల్ల్స్ కి ఎంత ప్రాముఖ్యత ఉందో --విశాఖపట్నం మురలీనగర్ కి అంతే పేరుంది .ఎక్కువగా బాగా ధనవంతులుండే ప్రాంతం .
ఆ మురలీ నగర్ లో వైషాఖి పార్క్ కి ఎదురుగా ఉంది " విశాల భవనం " పేరు లా చాలా విశాలంగా ఉంది .రెండు మైను గేట్లు --నలుగురు ఘూర్కాలు --లోపల ఇంద్ర భవనం లా ఉంటుందని అందరూ అనుకుంటుంటారు,ఆ ఇంటి యజమాని " లయం రామిరెడ్డి --చాలా పెద్ద కాంట్రాక్టరు --కోటీశ్వరుడు -ఆయన భార్య అరుంధతీ దేవి --మహిళామండలి అధ్యక్షురాలు .
వారికున్న ఏకైక సంతానం షాలినీ -ఆ స్తితిలో ఉండేవారు ఒక్కగానొక్క కూతుర్ని ఎలా పెంచుతారో --ఎలా చూసుకుంటారో ఊహించుకోవచ్చు.ఇక షాలిని అందాలరాశి --ఆ అందం ఆమెకు అలంకారమైతే బాగుండేది --కానీ అహంకారమైంది ఆ అహంకారమే ఆమెని నిలువునా ముంచేసింది .ఓ వైపు ధన మదం --మరో వైపు అందరికంటే ఎక్కువని గర్వం--డబ్బుండాలి గానీ --ఎక్కడైనా తిరగవచ్చు--ఏదైనా కొనవచ్చు --వింత వింత స్నెహాలు -సరదాలు --షికార్లు --వాటంతట అవే వెతుక్కుంటూ వచ్చేస్తయి --అల్లానే --వచ్చాయి కూడా --
ఓ వైపు కాంట్రాక్టులు --మరోవైపు రాజకీయాలు --ఇంకో వైపు క్లబ్బు పనులు --నాన్న చాలా బిజీ --ఇంచుమించు అమ్మ కూడా అంతే ,ఏది మంచి --ఏది చెడు --? ఎలా ఉండాలి ? ఎలా ఉండకూడదు ? చెప్పేవారు లేరు --నోరు మెదపని నౌకర్లు మాత్రం కళ్ళతో మాటలాడే వారు --గుసగుస లాడేవారు .
ఎం జరగ కూడదో --అదే జరిగింది -!చెయ్యి దాటింది --షాలిని తొందర పడిదో లేక కాలు జారిందో
" తల్లి అయింది " తల్లి చాలా కజువల్ గా తీసుకుంది -ఇదంతా నేటి కాలం లో సహజమే అంది --తప్పు లేదంది --పెద్దగా ఆశ్చర్య పడలేదు --అంతగా బాధ పడలేదు " కడిగేస్తే " పోతుందని చెప్పింది .
కానీ నాన్న బాధ పడ్డాడు --ఆందోళన చెందాడు -నలుగురికీ తెలిస్తే ? పిల్ల జీవితం ఎమవుతుంది?రేపు పెల్లి ఎలా జరుగుతుంది ?హడావుడిగా ఫ్యామిలీ దాక్టరుని కలిసి సంప్రదిస్తే
" అబార్షను " స్టేజీ దాటిపోయిందని --ఒకవేల చేసినా తన ప్రాణాలకు ముప్పూ అని చెప్పాడు -
డాక్టరు గారి సలహా మేరకు అంతా రహస్యం గా జరిగిపోయింది ,డెలివరీ కాగానే బిడ్డని ఎక్కడన్నా వదిలించుకుని --లేదాఎవరికన్నా ఇచ్చేసి --అమ్మాయిని చదువుకని వేరే ఎదన్న దేశానికి పంపించేస్తే సరిపోతుంది--ఇదీ నిర్ణయం-డబ్బు --హోదా -పలుకుబడి అన్నీ సక్రమంగా పనిచేసాయి -రహశ్యం గా ఇంట్లోనే డె లివరీ అయింది --కాకపోతే పసికూన చేతులు మారింది--అభినవ కుంతీ --మరో కర్ణుడిని కని రోడ్డు పాలు చేసింది .
**************** *************** ***************
మనిషి తాను అనుకున్నట్లు బ్రతకలేడు --ఇతరులు అనుకున్నట్లు గా చావనూలేడు --
రోజులన్నీ ఒకేలా ఉండవు -షాలిని లో చాలా మార్పులు వచ్చాయి .అహంకారం అణిగి పోయింది --ఆవేశం చల్లారిపోయింది--ఆలోచన మొదలయ్యింది -! ఎంత నీచం గా ప్రవర్తించింది
ఎంత ఘోరం చేసింది --పశ్చాతాపపు అలల సుడిలో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది -ఏదో
మైకం లో మూడు నిమిషాల సుఖం కోసం అర్రులు చాచింది --పరవాలేదూ -సరదా తీరిందనుకొంది -కానీ --ఇప్పుడు --ఇప్పుడు బాధపడుతోంది --హృదయ విదారకంగా ఏడుస్తొంది
శారీరకంగా,మానసికంగా క్షోబ అనుభవిస్తోంది ," మాతృత్వపు మాధుర్యాని తడిగా ఉన్న స్తనాలు " గురుతు చేస్తుంటే ,మడత పడిన పేగు మమతను గుర్తు చేస్తుంటే --మనస్సు తన
భందాన్ని -తన రక్తాన్ని గుర్తు చేస్తుంటే ఊరుకోలేక పోయింది.మనిషికీ మనస్సుకూ సంఘర్షణ్మొదలైంది .మనిషెమో ఇదంతా మామూలే అంటోంది --కనీ మనస్సు ఎదురు తిరిగింది
మానవత్వాన్ని ప్రభోదించింది -అమ్మతనపు అనురాగాల మధురిమలను చవిచూడమంటోంది
మాతృత్వం వరమని చెప్పింది .
ఓ రోజు ఇంట్లో జరిగిన సంభాషనతో అది కాస్త ముదిరింది ,అమ్మ తనకు పెళ్ళి చేసి దూరంగా విదేశాలకు పంపాలని చెప్పింది .వాళ్ళు పెళ్ళి చేస్తానంటే --తాను వద్దంది --తన తప్పుకు తానే భాద్యత వహిస్తానని --లోకంతో గానీ సంఘం తో గానీ సంభంధం లేదని ఖరాఖండి గా
చెప్పేసింది -తన బిడ్డ ఏమైందో --ఎవరికి ఇచ్చారో చెప్పమని బ్రతిమిలాదింది --ప్రాధేయపడిం ది
చివరికి చస్తానని బెదిరించింది ,,
నిజం గా చచ్చి పోతుందేమో నని వారి భయం చాలా తర్జన బర్జన తరువాత ఓ నిర్ణయం కి వచ్చారు --ముగ్గురూ కలిసి డా క్టరు గారిని కలిసి -అంతా చెప్పి బిడ్డని ఎవరికిచ్చారో చెప్పమని అడిగారు -దాదాపు నాలుగు నెలలైంది ఇప్పుడెలా అంటూనే నర్సుని పిలిచి అడిగారు .నర్సు చెప్పింది --ఆ --రోజు --చెత్త కుండిలో వే్శేద్దామని వె్ళ్ళాను కానీ -ఎంతో కొంత వస్తుంది కదా అనుకుని కె .జి,హెచ్ .వెనుక అడు్క్కుం టున్న కుస్టు వాళ్ళకు మూడు వందలకు అమ్మేసిందని చెప్పింది --అంతె వాళ్ల కోసం వేట మొదలైంది
తన బిడ్డ కోసం దిక్కు నడిగింది--చుక్కన డిగింది -పక్కనెళ్ళే పంచ భూతాలనడిగింది ,తన బిడ్డ దొరికితే నగరం లో అన్ని దేవాలయాలలో పూజలూ వ్రతాలూ ,దానాలు చేస్తానని మొక్కింది.
పిచ్చి దానిలా వెతికింది--వెతుకుతోంది --వెతికిస్తోంది --
****************** ************** **********
మా ఇంటికి అమ్మ ,అన్నయ్య ,వదినా .పిల్లలూ వచ్చారు .నాకు కొంత రిలీఫ్ వచ్చింది .అందరితో
ఇళ్ళు కళకళ లాడుంతుంటే చాలా ఆనందంగా ఉంది .అల్లా కొన్నాల్లు గడిచాయి .--
యధావిధిగా మేము బాబా మందిరానికెసి వెళ్ళాము .దర్శనం చెసుకుని బైటకు వస్తూ చుట్టూచూశాను --నా కళ్ళు ఎవరికోసమో వెతుకుతున్నాయి --ముస్టి వాల్లు లేరు --!
బయలుదేరుదామనుకుంటుంటే --సడం గా సర్రు సర్రు న రెండు --స్కార్పియోలు వచ్చి ఆగాయి --వెనుకనే గంభీరం గా తెల్లని ఇన్నోవా వచ్చి ఆగింది -ఎవరో రాజకీయ నాయకుడేమో అనుకున్నా ంకానీ అందులోనుంచి --ఓ అధ్భుత్ సౌందర్యరాశి దిగింది --
ఎదో మెరుపు మెరిసినట్టు అయింది --మొఖాన చిరునవ్వుతో --దిగి వయ్యారంగా చుట్టు చూసీ
అలా కారులోకి వంగి సున్నితం గా ఓ బాబుని ఎత్తుకుని బైటకు తెచ్చింది --
ఆశ్చ్రర్యం --ఆ --బాబే -- యువరాజులా --మెరిసిపోతున్నాడు --తన చిన్నారి చేతులతో తల్లి మెడ గట్టిగా కౌగిలించుకుని --వెనుక నుంచి నవ్వుల వాన కురిపిస్తున్నాడు --
నా కళ్ళంట --నాకే తెలియకుండా --కన్నీరు --" బాబా సాయి బాబా అంటూనే అలా రోడ్డు మీదే
సాస్తాంగ ప్రణామం చేసాను --దేముడా ధన్యవాదాలు --నిజం గా నువ్వు వున్నావయ్యా--
అంటూ వెనుతిరిగా --
***************
chaalaa baagundi. Ammatanam yeppudoo..Gelavaali . manchi katha andinchaaru. Thank you!!!
ReplyDeleteధన్యవాదములు వనజవనమాలిగారు ,అమ్మే ఎప్పుడూ గెలుస్తుంది ,ఆ శక్తి ,సహనం ,త్యాగం
Deleteఈ సృ్టి లో ఒక్క అమ్మ కిమాత్రమే ఉంటాయి ,నా కధ చదివినందుకు ,స్పందించినందుకు మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు ,సరాగ లో నా కవిత ప్రచురిపబదింది అది కూడా చదివి మీ అభిప్రాయం చెప్తే సంతోషి్త్తాను
ఈ సంఘటన నిజంగానే జరిగిందా? లేక ఇది కథా? కళ్ళు చెమర్చాయి మొత్తం చదివాక.
ReplyDeleteవెన్నెల గారూ ఇది నిజంగానే జరిగింది ,కాకపోతే స్తలం ,పేర్లు మార్చాను ,దీనికి నేనే సాక్ష్యం ,కధ చదివిన మీకే ఇలా ఉంతే నిజం గా చూసిన నాకు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించంది
Deleteఅసలు నాకూ అదే డౌటు వస్తుంది.అంతా చదివాకా మూడు ప్రశ్నలు.
ReplyDelete1. అంత డబ్బు, పొలిటికల్ బాక్ గ్రౌండ్ ఉన్నవాళ్ళు మోసం చేసినవాడిని వదిలివేయడం foolishness. పోనీ తాగిన మైకం లో తప్పు జరిగిపోయిందని వాడెవడో తెలియదనీ మీరు సమర్ధించుకున్నప్పటికీ కనీసం దాని ప్రస్తావన కధనమ్లో రావాలి.
2. ఇంత డబ్బు,హోదా ఉన్న అమ్మాయిని కోరిక తీర్చేసు కుని (కనీసం బాక్ మైల్ చేయకుండా) వదిలేసిన ఆ మంచి వెధవ ఎవడండీ బాబూ ?
3. కాసేపు ఇది వాస్తవమే అని అనుకుంటే...ఎవరికీ తెలియని ఆమె భాగోతం మీకెలా తెలిసింది? ఆమె చేతిలో మీరు చూసిన బాబుని ఆమె పెంచుకోవడానికి తీసుకుని ఉండవచ్చుకదా..? లేదూ ..ఇది కధ అని మీరంటే (పైన రెండవ ప్రశ్నని బట్టి) వాస్తవ దూరం,అసమంజసం.
ఊహ లనే మొగ్గ లని తుంచే్సి పరిచితే ఒకలా ఉంటుంది. కానీ అవి విరిసి పూలయ్యాకా పరిచితే అందమైన పూలపానుపు అవుతుందని నా అభిప్రాయం. ఏమంటారు?
మంతెన గారూ నమస్తే ,కావాలనే అతని ప్రస్తావన తేలేదు ,ఎందుకంటే వాడుకున్నది ఈమె కనుక ,వీళ్ళ హోద డబ్బు కి భయపడి ఊరుకున్నాదేమో ? ఇకపోతే ఈ మధ్య విశాఖపట్నం చాలా బాగా అభివృద్ది చెందింది .ఇది నిజంగా జరిగింది ,ఆవిడకి మాటిచ్చాను ,అందుకే వివరం గా వ్రాయలేకపోయాను మీకు ఇంకా వివరం గా చెప్పాలని ఉంది గాని కొద్ది రోజులు ఓపిక పట్టండి ,వివరించగలను ,తరువాత మీరే ఒప్పుకుంటారు ఎందుకు రహస్యంగా ఉంచానో ,త్వరలో మల్లీ కలుస్తాను .ఎమైనా మీ స్పందనకు నిజం గా నా ధన్యవాదాలు
Delete