Tuesday 14 February 2012

నే చూసిన " విశ్వరూపం " ?

శూన్యం లో మహా విస్పోటనం  జరిగిందో ? --లేదో --?
బిగ్ బాంగ్  థియరి నిజమో కాదో --
పాలపుంతలో గ్రహవిన్యాసాలు  అవునో ?  కాదో  ?
---నాకు  అనవుసరం --
నాకు తెలిసిన  అద్భుత ప్రపంచం --నాన్న --
ఎవరెస్టు కన్నా ఎత్తైన వ్యక్తిత్వం --
పసిఫిక్ కన్నా లోతైన మమకారం --
నాలుగు దిక్కుల నడుమ
పంచభూతాల సంగమ క్షెత్రం లో -
"ఆలికి "---మాతృత్వపు  మాధుర్యాన్ని పంచి
అమ్మ గా నిలిపిన ఓ --వి్శ్వరూపమా --
ఓం కార బీజాక్షర ,ఆది ప్రణవనాదాలతో
ప్రపంచానికి నన్ను పరిచయం చేసిన
ఓ సజీవ దైవమా --నీవేనా  "---నాన్నంటే -"
నీ మాటే వేదం గా --నీ బాటే నాదం గా
నా అణువణువు  నీవై --అంబరమంతా నీవై -
ఆప్యాయతలకు నిలయమై --
ఆశయ ఆదర్సాలకు కొలువై --
నా అంతా నీవై --నీ --వింతే --నేనై --
మానవ జాతికి  మార్గదర్సివై  --మనీషివై --మహాత్ముడవు నీవై --
మమతానురాగాల పందిల్లలో మానవత్వం పూయించిన --ఓ --నాన్నా--
నిన్ను --నా హృదయపు కోవెలలో    ప్రతిస్టించి --
నా నయన మైదానాలమీద --" చిరంజీవిగా --'
నిత్యం --నీ వి్శ్వరూపాన్ని --పూజిస్తా --నాన్నా --.



2 comments:

  1. అద్భుతంగా రాసారు.
    నాన్నా నీకు జోహార్లు..

    ReplyDelete
  2. ధన్యవాదములు వినోద్ గారూ ,నా బ్లాగ్ సందర్సించినందుకు మరొక్కసారి థాంక్స్ చెప్తున్నాను ,మీకు వీలుంటే నా ఇతర రచనలు చదివి మీ అభిప్రాయం తెలియచేయగలరు

    ReplyDelete