Friday 26 July 2013

స్వచ్చ మైన వ్యక్తులు రాజకీయాల్ లోకి రావాలి --కావూరి సాంబశివరావు

దేశం లో --
అవినీతి బాగా పెరిగిపోయిందని
అభివ్రుద్ది కుంటుపడిందని
ఆవేదన వ్యక్తం చేశారు -శ్రీ కావూరి వారు -కేంద్ర మంత్రి కూడా
స్వచ్చ్ మైన వ్యక్తులు రాజకీయాల లోకి రావాలని లేక పోతే ఇడియట్సు రాజ్యం ఏలుతారని సెలవిచ్చారు .
--అంటే ఇప్పుడు ఉన్నవారు కాదా ?
మనసులో మాట చెప్పకనే చెప్పారు --చాలా థాంక్స్
ఒక వేళ నిజంగా స్వచ్చ్ మైన వారు వస్తే మీరు రానిస్తారా?
పదవి ఉంటే ఒకలాగ మాటలాడి
పదవి లేక పోతే మరొకలాగ మాటలాడే మీరు
స్వచ్చ్త గురించి మాటలాడటమా ?
అయ్యా పెద్ద మనుషులూ కాస్త ఆలోచించి మాటలాడితే బాగుంటుందేమో /
ఇక పోతే ఇడియట్సు రాజ్య మేలుతారని అన్నారు కదా
ఇప్పుడున్నవారు కాదా ?
ఎల అర్ధం చేసుకోవాలి --మిమ్మల్ని ?
మీరే సెలవివ్వండి 

Wednesday 24 July 2013

ఆంధ్రా అసెంబ్లీ --డిల్లీ లో పెడితే బాగుంటుందేమో --? ఒక్కసారి ఆలోచించండి --;

నిజంగా -- ఇది నిజం --
ఆంధ్రులు --అమాయకులా ?అల్ప సంతోషులా ?
అనాధలా ? లేక ఆలోచించని వారా ?
అడుగడుగునా అధికార దుర్వినియోగం --జరుగుతున్నా
పట్టించ్జుకోని ఘనత మనదేనా ?
అవినీతి --అంతై --అంతంతై --అకాశమంతా ఆక్రమించినా
కనీసం  ఆవెశం కూడా రానివాడు ==
ఆంధ్రుడే ననుకుంటా --
కాకపోతే మరేమిటండీ --
ప్రతి చిన్న విషయానికి --" డిల్లీ " చుట్టు ప్రదక్షినలు చేస్తూ
ఆత్మగౌరవాని  అక్కడ వీధుల పాలు చస్తుంటే
నోరు మూసుకుని కూర్చోవడం మంచిదా ?
పరిపాలన మొత్తం డిల్లీ కనుసన్నలలో జరుగు తుంటే
ఇక ఇక్క్డ అసెంబ్లీ ఎందుకు ?
కరంటు .పోలీసు ,అది ,ఇది అన్నీ దందగే కదా
ఎంత ప్రజా ధనం దుర్వినియోగం అవుతుందో ఆలోచించండి
పదవి కోసం --డిల్లీ-ప్రాపకం కోసం --డిల్లీ
మంత్రి పదవి కావాలా --డిల్లీ --ఉన్న పదవి తీయాలా --డిల్లీ
పధకం పెట్టాలా --డిల్లీ --
చివరకు వ్యక్తి గత విషయాలకు కూడా - సారీ --
అనక తప్పడం లేదు -
డిల్లీ --అనుమతి కావాలి --
చెతకాని వాళ్ళమా లేక చేవ లేని వాల్లమా
అందుకే --అందుకే --
ఇక్కడ --అసెంబ్లీ అక్కడ పెడితే బాగుండును కదూ--