Showing posts with label జనం. Show all posts
Showing posts with label జనం. Show all posts

Monday, 24 December 2012

యువతరం ' శివమెత్తితే " ఢిల్లీ సాక్షిగా --నవతరం రాదా? యువతా మీకు జోహార్లు --!

ముందుగా-
మహాకవి శ్రీ శ్రీ అన్నట్లుగా " కొంతమంది యువకులు ముందుయుగం దూతలు ,భావన నవజీవన బృందావన
నిర్మాతలు --వారికి మా ఆహ్వానం --వారికి మా లాల్ సలాం .అటువంటి యువతకి చై ఎత్తి జోహార్లు చెప్తూ---
అదే స్పూర్తి --
అదే శక్తి --
అదే పట్టుదల --
అంబరం అదిరింది
అంభోనిది బెదిరింది ,
" అబల " పై -అకృత్యానికి --నిరసనగా
ఆవేశం గళమెత్తి --ఒక్కటైంది -
ఆదర్శం -ఆశయాన్ని --ఎక్కుపెట్టింది ,
ఆ సేతు హిమాచలం --
" మానవత్వం " ఉప్పెనై పొంగింది
జన సునామీ కి --" ఢిల్లీ " --వణికింది ,
యంత్రాంగపు --మంత్రాంగాలు
తంత్రాల --కుతంత్రాలు --అవాక్కయ్యాయి -,
దిక్కు లేనివారం -మేము కాదంటూ-ధైర్యంగా
హక్కుల కోసం --నినదిస్తే --గర్జిస్తే --
భారతావని --భగ్గు మంది -
ఇదే స్పూర్తి --
ఇదే శక్తి -
ఇదే పట్టుదల కొనసాగిస్తే -
రొ్స్టు రాజకీయాలు --మార్చలేమా ?
కుస్టు కుంభకోణాలు --ఆపలేమా ?
అవినీతి --అన్యాయాల నెదిరించలేమా ?
అప్రజాస్వమ్యాన్ని --అంతమొందించలేమా ?
అఖండ భారతాన్ని --నిర్మించి
అజేయ శక్తి గా మార్చలేమా ?
భరతమాత ను గర్వం గా నిలబెట్టలేమా?
రండి --కదిలి రండి --కలిసి రండి --
మీరంతా --ఊ్రంతా --ఉప్పెనలా --
అదిగో --అల్లదిగో --అదిగదిగో --
యువతరం చేతుల్లో --
నవతరం --నవ్య భారతం --

Friday, 20 January 2012

చిత్రం---విచిత్రం

అర్ధాకలితో---అర్ధనగ్నంగా--,
నడివీధుల్లో నడుస్తున్న "స్త్రీ"ని
చూసి,నవ్వె వాల్లెందరు--పరిహాసించే వారెందరో-
ఇదేమిటి  ఈ మనుషుల 'మనసు' మిత్రమా-
చిత్రం--భలారే--విచిత్రం
అదే స్త్రీ అర్ధనగ్నంగా
తెరపై నాట్యమాడుతుంటే
వంద రోజులు పూర్తిచేసేందుకు
పరిహాసించించినవాల్లే ప్రయత్నాలు చేస్తుంటే
ఇదేమిటీ  ఈ మనుష్యుల మనసు మిత్రమా
చిత్రం  విచిత్రం
ఫైవ్  స్టార్ హోటల్లొ
డిమ్ము లైటు కాంతుల్లో
రమ్ము నిండు గ్లాసుల్తో
దమ్ము కొ్ట్తు బాబుల్తో
"నూలుపోగు" లేకుండా నర్తించే డాంసెర్ కై
అర్రులు చాచే ఈ మనుస్యుల మనసు
చిత్రం--నిజంగా--విచిత్రం